పోలీసులను బెదిరిస్తున్న వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై తక్షణం కేసు నమోదు చేయాలని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐపీసీ - వైసీపీగా మారిందా అని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిలదీశారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా, వైకాపా కార్యకర్తలు పోలీసుల్లా పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. పార్టీలు మారేలా ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఒక ఐపీఎస్ అధికారిని దుర్భాషలాడి, బెదిరించడం.. వైకాపా అరాచకత్వానికి పరాకాష్ఠగా విష్ణువర్ధన్‌రెడ్డి అభివర్ణించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారెవరో ప్రభుత్వానికి తెలుసని.. వారిని రక్షించేందుకు ఇతర పార్టీలపై కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. వైకాపా కార్యకర్త పాస్టర్ ప్రవీణ్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు కేసు పెట్టకపోవడాన్ని తప్పుపట్టారు.
ఇదీ చదవండి: 'ఎస్సీపై.. ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు'