ETV Bharat / city

Somu veerraju: అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వని పార్టీ పాలన సాగిస్తోంది: సోము వీర్రాజు

Somu veerraju: రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వని పార్టీ పాలన సాగిస్తోందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యతనిస్తుంటే.. అప్పులూ, తాకట్లుపైనే వైకాపా ప్రాధాన్యం ఇస్తోందని ఎద్దేవా చేశారు.

BJP leader somu veerraju fires on YSRCP over developments in state
రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వని ప్రభుత్వం పాలన సాగిస్తోంది: సోము వీర్రాజు
author img

By

Published : Mar 8, 2022, 5:13 PM IST

రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వని ప్రభుత్వం పాలన సాగిస్తోంది: సోము వీర్రాజు

Somu veerraju: రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి ప్రధాన్యం ఇవ్వని వైకాపా పాలన సాగిస్తోందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. జలజీవన్ మిషన్ కింద రూ.7 వేల కోట్లు కేంద్రం ఇస్తే దాన్ని అందిపుచ్చుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యతనిస్తుంటే.. అప్పులూ, తాకట్లుపైనే వైకాపా ప్రాధాన్యం ఇస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మత్స్యకారులకు ప్రాధాన్యతనివ్వటం లేదన్నారు.

గుడివాడలో కేంద్రం ఆర్ఓబీలు కడుతుందని తెలిపారు. 2024లో రాష్ట్రంలో భాజపా, జనసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని స్పష్టం చేశారు. ధాని నరేంద్ర మోదీ వల్లే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సోమువీర్రాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: TDP leaders fires on YSRCP: ప్రభుత్వం చేతకానితనంతోనే రాష్ట్రంలో మహిళలపై దాడులు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.