రాష్ట్రంలో అవినీతిని కేంద్రీకృతం చేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇంత యథేచ్చగా అవినీతి జరుగుతున్న తీరును.. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. చాకెట్లు ఇచ్చి నక్లెస్‌లు దోచుకున్న తీరుగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బులిచ్చి.. ఇష్టారీతిన ఛార్జీలు పెంచేశారని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని.. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో నిలబడ్డామని మండిపడ్డారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం తిరుపతి, రేపు విజయవాడ వస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేసి.. రహస్య పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు. ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందనే.. రహస్య జీవోలు ప్రవేశపెడుతోందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని.. జీవోల సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.
e-KYC for ration: రేషన్ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులందరికీ.. ఈ-కేవైసీ తప్పనిసరి!