వైకాపా ప్రభుత్వ విధానాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు చేసిన ప్రచారంలో.. రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదని గుర్తు చేశారు. నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్న కన్నా.. వైకాపా ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఉందని చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. 2024లో ప్రజలు వైకాపాకు సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రాజధాని మార్చేందుకు వైకాపా చెబుతున్న మాటలను ప్రజలెవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. త్వరలోనే జనసేనతో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: