కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి భారత్ బయోటెక్ కంపెనీ 2 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించింది. కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎమ్. ఎల్లా, కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర కె. ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి. ప్రసాద్ ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి చెక్కును అందించారు. కరోనా వైరస్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్ ఆవిష్కరించనున్నట్లు ఛైర్మన్ కృష్ణ ఎమ్. ఎల్లా తెలిపారు.
ఇదీ చూడండి: