రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే స్థాయిదాకా స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలు పోటీ చేస్తారని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు అన్నారు. 13 జిల్లాల నూతన రాష్ట్ర కార్యవర్గానికి విజయవాడలో నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆర్ కృష్ణయ్య అడుగుజాడల్లో బీసీల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రతి డివిజన్లో పోటీ చేస్తామన్నారు.