ETV Bharat / city

Modi Praises Eatala : శభాష్​ ఈటల.. 'చోటా ఆద్మీ బడా కామ్​ కరే' అంటూ మోదీ ప్రశంసలు - pm modi hyderabad tour

Modi Etela News: హైదరాబాద్​ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తిరిగి వెళ్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మోదీకి వీడ్కోలు పలికేందుకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సహా ప్రముఖులు శంషాబాద్​ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా.. బండి సంజయ్ ఈటలను ప్రధానికి​ పరిచయం చేశారు.

మోదీ ప్రశంసలు
మోదీ ప్రశంసలు
author img

By

Published : Feb 6, 2022, 8:15 AM IST

మోదీ ప్రశంసలు

Modi Etela News: హైదరాబాద్​లో ప్రధాని మోదీ పర్యటన ముగించుకొని వెళ్తున్న సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. శనివారం హైదరాబాద్​ వచ్చిన మోదీ.. పటాన్​చెరులోని ఇక్రిశాట్​ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి దిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికేందుకు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ సీఎం రమేష్​, మాజీ ఎంపీలు జి.వివేక్ వెంకటస్వామి, చాడా సురేష్ రెడ్డి వచ్చారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్​ను ప్రధానికి బండి సంజయ్​ పరిచయం చేశారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో జరిగిన హోరాహోరీ పోరులో తెరాసను ఓడించారు.. అంటూ పరిచయం చేశారు. వెంటనే ఈటల భుజం తట్టిన మోదీ ఆయన్ను అభినందించారు. 'చోటా ఆద్మీ బడా కామ్​ కరే' అని అన్నారని భాజపా నేత ఒకరు తెలిపారు. అనంతరం బండి సంజయ్ భుజంపై చేయి వేస్తూ.. క్యా బండీ.. ఠీక్​ హై.. అంటూ పలకరించారు. (సంజయ్ బండి జీ.. ఏం సంగతి? అంతా బాగే కదా) ఇక వెళ్లి రానా అంటూ ఆప్యాయంగా భుజం తట్టారు. అనంతరం ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీ వెళ్లిపోయారు.

ఇదీచూడండి:

PM Modi on Samatamurthy: 'జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.