కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో తెదేపా అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో విజయమ్మ కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ఉప ఎన్నికలో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు గంటకుపైగా చర్చించారు.
సీఎం జగన్ వైకాపా అభ్యర్థుల గెలుపు కోసం, మంత్రులు, ఎమ్మెల్యేలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో..తెదేపా అభ్యర్థి రాజశేఖర్ గెలుపు కోసం కూడా పార్టీ నేతలతో కమిటీలు వేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీ తరపున ముఖ్యమైన నాయకులకు బాధ్యతలు అప్పగించే విషయంపై శనివారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఎవరెవరికి బాధ్యతలు అప్పగించేది రేపు వెల్లడిస్తామని బాబు చెప్పినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి