ETV Bharat / city

MPP elections: ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ - ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన మండలపరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో పలుచోట్ల అసమ్మతి అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. అధికార పార్టీకి ఆధిక్యం లభించినా, అసమ్మతివర్గాలు(Backlash to MLAs in MPP elections) ఎదురుతిరిగాయి. దీంతో ఎమ్మెల్యేలు ప్రతిపాదించినవారు కాకుండా, వేరే అభ్యర్థులు మండలపరిషత్‌ అధ్యక్షులయ్యారు.

MPP elections: ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

author img

By

Published : Sep 25, 2021, 4:47 AM IST

Updated : Sep 25, 2021, 12:56 PM IST

MPP elections: ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీపీ స్థానానికి వారు బలపరిచిన అభ్యర్థులపై ఏకాభిప్రాయం రాలేదు. అసమ్మతివర్గాల గైర్హాజరుతో కోరం లేక కొన్నిచోట్ల ఎన్నిక వాయిదాపడింది. అధికార పార్టీలోని రెండువర్గాల మధ్య అక్కడక్కడ తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థులు కాకుండా.. అసమ్మతి అభ్యర్థులు ఎంపీపీలుగా పలుచోట్ల ఎన్నికయ్యారు. వీరికి అక్కడక్కడ తెదేపా, స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 649 మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు ప్రారంభించగా.. వాటిలో 15 అధ్యక్ష, 30 ఉపాధ్యక్ష స్థానాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా 624, తెదేపా ఏడు, జనసేన, సీపీఎం చెరో ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఒక స్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ఈ స్వతంత్ర అభ్యర్థి తెదేపాలో చేరినట్లు సమాచారం.

సభాపతి నియోజకవర్గంలోనూ...

* స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలుండగా.. వైకాపా 12, తెదేపా 9 గెలుచుకున్నాయి. ఎంపీపీ స్థానానికి వైకాపా బరిలో నిలిపిన వ్యక్తికి 9 మంది ఎంపీటీసీలు మద్దతిచ్చారు. మిగతా ముగ్గురు అసమ్మతివర్గంగా ఏర్పడ్డారు. వీరు, తెదేపా గైర్హాజరవడంతో వాయిదా పడింది.

*టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వైకాపా 18, తెదేపా 2 స్థానాలు గెలిచాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రతిపాదించిన అభ్యర్థికి 8 మంది వైకాపా సభ్యులే మద్దతు పలికారు. వ్యతిరేకంగా 10మంది ఎన్నికకు హాజరుకాలేదు. కోరంలేక ఎన్నిక వాయిదా పడింది.

.

ఎమ్మెల్యేలను తోసిరాజని..

* శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం ఎంపీపీ అభ్యర్థిగా లుకలాపు సావిత్రిని ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రతిపాదించారు. అసమ్మతి అభ్యర్థిగా వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు తూలుగు మేనక బరిలో నిలిచారు. వైకాపాకు చెందిన ఇద్దరు, తెదేపాకు చెందిన ముగ్గురు మేనకకు మద్దతు ఇవ్వటంతో ఆమె ఎంపీపీగా గెలిచారు. మెళియాపుట్టి మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా పాడి ధనలక్ష్మిని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. తెదేపా సభ్యుల మద్దతుతో వైకాపా అసమ్మతి సభ్యురాలు రాణ ఈశ్వరమ్మ ఎంపీపీగా గెలిచారు.

* అరకు మండలం ఎంపీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ ప్రతిపాదించిన అభ్యర్థికి ఇద్దరే మద్దతు పలికారు. అసమ్మతి వర్గం ప్రతిపాదించిన అభ్యర్థి రంజుపల్లి ఉషారాణి ఇక్కడ ఎంపీపీ అయ్యారు. పెదబయలులో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థి కాకుండా.. అసమ్మతిగా బరిలో దిగిన బొండా వరహాలమ్మ ఎంపీపీ అయ్యారు.

* పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలంలో తెదేపా, వైకాపా అసమ్మతి సభ్యుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి ఎంపీపీగా గెలుపొందారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థి ఓడారు. చింతపల్లి మండలంలోనూ ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలై.. అసమ్మతి వర్గంలోని వంతల బాబురావు గెలిచారు. పాడేరు మండలంలోనూ ఇలాగే జరిగింది.

* విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో 20 స్థానాలకు గాను వైకాపా 17, తెదేపా 3 స్థానాలు గెలిచాయి. వైకాపా చీలిపోయింది. ఎస్‌.కోట ఎమ్మెల్యే వర్గం నుంచి ఆరుగురు సభ్యులే హాజరయ్యారు. అసమ్మతి వర్గం, తెదేపా సభ్యులు హాజరు కాకపోవటంతో కోరం లేక ఎన్నిక వాయిదాపడింది. వేపాడ మండలంలో అసమ్మతి వర్గంలో ఒకరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే వర్గం సభ్యులు, అనుచరులు ఎన్నికల కేంద్రంలోకి చొరబడి.. అధికారుల చేతుల్లోని పత్రాలు లాక్కున్నారు. అసమ్మతి నేతలు ఎమ్మెల్యే శ్రీనివాసరావును అడ్డుకుని నిరసన తెలిపారు. కాసేపటి తర్వాత ఎన్నిక జరిగింది.

* పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లిలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రతిపాదించిన అభ్యర్థికి ఒక్కరు మినహా ఎవరూ మద్దతు ఇవ్వలేదు. అసమ్మతి వర్గం గైర్హాజరు కావటంతో ఎన్నిక వాయిదా పడింది.

* నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలో ఎమ్మెల్యే రోజా ప్రతిపాదించిన అభ్యర్థిని వ్యతిరేకిస్తూ.. భాస్కర్‌రెడ్డి బరిలో నిలిచారు. అసమ్మతి వర్గం గైర్హాజరుతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.

* పెదకూరపాడు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు వైకాపాయే గెలిచింది. ఎమ్మెల్యే ఎన్‌.శంకర్రావు ప్రతిపాదించిన అభ్యర్థిని మరో వర్గం వ్యతిరేకించింది. ఇరువర్గాల గైర్హాజరుతో ఎన్నిక వాయిదాపడింది.

* మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 తెదేపా, ఒకటి జనసేన, 8 వైకాపా గెలిచాయి. మండల పరిషత్‌ను దక్కించుకునేందకు వీలుగా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. అధికార వైకాపా తమ సభ్యులను ఎక్కడ లాక్కుంటుందోనని తెదేపా, జనసేన సభ్యులు శుక్రవారం హాజరుకాలేదు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.

* నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థికి చుక్కెదురైంది. అసమ్మతి అభ్యర్థి ఎమ్మెల్యే వర్గంలోని ఇద్దరు ఎంపీటీసీలను తనవైపు తిప్పుకొని, తన వర్గంవారు గైర్హాజరయ్యేలా చేయడంతో ఎన్నిక వాయిదాపడింది. వరికుంటపాడు మండలంలో ముందుగా ఒప్పందం చేసుకున్న అభ్యర్థినిని కాదని.. ఎమ్మెల్యే మరో అభ్యర్థిని ప్రతిపాదించటంతో వ్యతిరేకించిన అసమ్మతి వర్గం తమ అభ్యర్థిని గెలిపించుకుంది.

* గూడురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని అసమ్మతి వర్గం వ్యతిరేకించింది. రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది. అసమ్మతి వర్గం ధర్నాకు దిగింది. చివరికి ఎన్నిక వాయిదా పడింది.

* మడకశిర నియోజకవర్గం అమరాపురంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రతిపాదించిన అభ్యర్థికి మిగతావారు మద్దతు ఇవ్వలేదు. వారు ఎన్నికకు గైర్హాజరు కావటంతో ఎన్నిక వాయిదా పడింది.

* తూర్పుగోదావరి జిల్లా రాజోలు, కడియం మండలాల్లో జనసేన మద్దతుతో తెదేపా, మలికిపురం మండలంలో తెదేపా మద్దతుతో జనసేన ఎంపీపీ స్థానాల్ని దక్కించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వీరవాసరం, ఆచంట ఎంపీపీలుగా తెదేపా అభ్యర్థులు జనసేన మద్దతుతో ఎన్నికయ్యారు. కృష్ణాజిల్లా చల్లపల్లి, మోపిదేవి, కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలాల్లో తెదేపా ఎంపీపీ స్థానాల్ని దక్కించుకుంది.

ప్రకాశం జిల్లాల్లో అన్నిచోట్లా పూర్తి..

ప్రకాశం జిల్లాలో శుక్రవారం అన్ని ఎంపీపీ, ఉపాధ్యక్షుల, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఎన్నికలు వివిధ కారణాలతో శనివారానికి వాయిదా పడ్డాయి.

* శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని ఒక్కో మండలంలో కో-ఆప్షన్‌ సభ్యుల స్థానాలకు నామినేషన్లే దాఖలు కాలేదు. వీరి ఎన్నిక పూర్తయ్యాకే ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఆ ఎన్నికలు శనివారం జరిగే అవకాశముంది.

కలిసికట్టుగా కైవసం..

తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను తెదేపా, జనసేన ఉమ్మడిగా కైవసం చేసుకున్నాయి. అధ్యక్షుడి ఎన్నికకు ఇరు పార్టీల అభ్యర్థులు చేతులెత్తి ఆమోదం తెలిపారు. ఎంపీపీ సత్యప్రసాద్‌ (తెదేపా), ఉపాధ్యక్షుడు గణపతి (జనసేన)ని సభ్యులు అభినందించారు.

ఇదీ చదవండి:

PARISHAD: జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నేడు

Last Updated : Sep 25, 2021, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.