ETV Bharat / city

"కాంబాబు ఎవరో జగనే చెప్తారు.." అయ్యన్నపాత్రుడు మరో ట్వీట్! - Ayyanna another tweet on Ambati

Ayyanna another tweet on Ambati: మంత్రివర్గంలో కాంబాబు ఎవరో.. జగన్ రెడ్డి త్వరలోనే చెప్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మరో ట్వీట్ చేశారు.

Ayyannapatrudu
Ayyannapatrudu
author img

By

Published : May 14, 2022, 1:46 PM IST

Ayyanna another tweet on Ambati: మంత్రివర్గంలో కాంబాబు ఎవరో జగన్ రెడ్డి త్వరలోనే చెప్తాడంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు మంత్రి అంబటి రాంబాబును ట్యాగ్ చేశారు. మంత్రివర్గం నుంచి కాంబాబును త్వరలోనే బర్తరఫ్ చేయబోతున్నారంటూ.. ఇటీవల అయ్యన్న పాత్రుడు సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా.. తాజాగా మరో ట్వీట్ చేశారు. మంత్రి ఇంటర్వ్యూ అడిగిన ఓ యూట్యూబ్‌ యాంకర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన మంత్రి బూతు పురాణం.. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకూ చేరిందని ట్వీట్​లో అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అంతేకాదు.. సదరు యూట్యూబ్ యాంకర్ త్వరలోనే సీఎం ని కలవబోతున్నారని, అప్పుడు జగనే కాంబాబు ఎవరో చెప్తారని ట్వీట్ లో పేర్కొన్నారు.

Ayyanna another tweet on Ambati
అయ్యన్నపాత్రుడు మరో ట్వీట్...

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.