కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రి ఎలక్ట్రీషియన్స్కు శిక్షణ ఇచ్చారు. ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుకోని విపత్తు ఎదురైతే క్షతగాత్రులను ఏ విధంగా కాపాడాలో డెమో ద్వారా చూపారు.
ఇదీ చదవండి: ఆసుపత్రి సిబ్బంది- రోగి బంధువుల మధ్య ఫైటింగ్
మంటలను ఏవిధంగా అదుపులోకి తీసుకురావాలి.. ఎటువంటి ఫైర్ ఫైటింగ్ పరికరాలు వినియోగించాలో అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో విద్యుత్ పరికరాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యుత్ శాఖ అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు