ETV Bharat / city

సాంకేతికతలో ముందంజ.. ఏపీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట - news on apstc

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ముందంజలో ఉంది. దేశంలోని అన్ని రవాణా సంస్థలను తోసిరాజని ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. సాంకేతికత వినియోగంలో జాతీయస్థాయి అవార్డులను సొంతం చేసుకుంది

awards to apsrtc for using technology
ఏపీఎస్ఆర్టీసీ
author img

By

Published : Oct 15, 2020, 7:54 AM IST

అధునాతన సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. వివిధ యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువైంది. ఆర్టీసీ ఆన్‌లైన్‌, లైవ్‌ ట్రాక్‌, చలో యాప్‌, ప్రథమ్‌ యాప్‌లతో మొబైల్‌లోనే సమస్త సమాచారం అందుబాటులోకి తెచ్చింది. బస్సుల సమయవేళలు, టికెట్లు బుక్‌ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం, సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం వంటి సదుపాయాలను యాప్‌ల ద్వారా కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలందిస్తున్నందుకు గానూ వివిధ విభాగాల్లో జాతీయస్థాయి అవార్డులను ఆర్టీసీ కైవసం చేసుకుంది.

ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌ యాప్‌ను 25 లక్షల మందికి పైగా, ఇతర యాప్‌లనూ లక్షలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారంటే.. వీటికున్న ఆదరణ ఏపాటిదో అర్థమవుతోంది. బస్సు నెంబర్‌ లేదా సర్వీస్‌ నెంబర్‌తో బస్సు ఎక్కడుంది.. ఎప్పటికి వస్తుందనే కచ్చితమైన సమాచారాన్ని ఈ లైవ్‌ట్రాక్ యాప్‌ అందిస్తోంది. దీని కోసం అన్ని బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ అండ్ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ అనే ఆధునిక పరిజ్ఞానాన్ని ఆర్టీసీ వినియోగిస్తోంది. అన్ని డిపోల్లోని 11 వేల బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసి శాటిలైట్‌తో అనుసంధానించింది. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల పనితీరు వంటి అంశాల్ని పరిశీలించి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఆపత్కాలంలో యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే.... సమీప పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు వెళ్లేలా ఏర్పాటు చేశారు.

డిజిటల్ టికెటింగ్ సొల్యూషన్ ద్వారా డిజిటల్ విధానంలో ప్రయాణికులకు ఆర్టీసీ టికెట్లు జారీ చేస్తోంది. ఈ విధానంలో లక్షల మందికి టికెట్లు విక్రయించి అత్యుత్తమ విశేష సేవలు కనబరిచినందుకు ఇటీవలే ఆర్టీసీకి అవార్డు దక్కింది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న పరిస్ధితుల్లో టికెట్ల కొనుగోలుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించింది. ఈ- గవర్నెన్స్ కార్యకలాపాలు అత్యుత్తమంగా నడిపినందుకు జాతీయస్థాయిలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డును ఆర్టీసీ దక్కించుకుంది. మెకానికల్ విభాగాల్లో ఐటీఐ, డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులను అప్రెంటీస్‌లుగా నియమించి అత్యధిక మందికి ఉపాధి కల్పించిన సంస్థగా కౌశలాచార్య ఇండియా ఆవార్డునూ సైతం కైవసం చేసుకుంది.

బస్సుల్లో మొబైల్ యాప్ ద్వారా టికెట్లు జారీ చేసేలా ప్రథమ్ పేరిట ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించిన ఆర్టీసీ ప్రయోగాత్మకంగా కొన్ని డిపోల్లో అమలు చేస్తోంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సహా అన్ని బస్సుల్లోనూ ప్రయాణికులే యాప్ ద్వారా టికెట్ తీసుకునేలా దీన్ని అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ

ఇదీ చదవండి: 6 జిల్లాలు అతలాకుతలం...11 మంది మృత్యువాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.