Auto Workers Protest: ఎన్నికల సమయంలో ధరలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని ఆటో కార్మికులు మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆటో కార్మికులు.. ఆటోలను తాడుతో లాగుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆటో కార్మికుల సంఘం కార్యదర్శి దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క అధిక ధరలతో ఇబ్బందులు పడుతుంటే.. పోలీసులు వేలకు వేలు పెనాల్టీల రూపంలో వసూలు చేస్తూ మరింత భారాలు మోపడం సరికాదన్నారు. తక్షణమే పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ఇబ్బంది కలిగించే జీవో నెంబర్ 20ను రద్దు చేయాలని, లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: TG Venkatesh: బంజారాహిల్స్ స్థల వివాదంతో నాకెలాంటి సంబంధం లేదు: టీజీ వెంకటేశ్