ETV Bharat / city

'ఖర్చు తగ్గినా... రుసుములు ఎందుకు?'

ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని ఓ విభాగంలో జాతీయ కార్యశాల నిర్వహిస్తామని అభ్యర్థుల నుంచి రుసుములు వసూలు చేశారు. ఆ తరువాత నేరుగా కాకుండా.. ఆన్ లైన్ లో సమావేశాలు నిర్వహించారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. అయినా.. రుసుములు వెనక్కి ఇవ్వని వైనంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

au work shop
au work shop
author img

By

Published : Nov 5, 2020, 4:32 PM IST

ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని ఓ విభాగంలో జాతీయ కార్యశాల నిర్వహిస్తామని అభ్యర్థుల నుంచి రుసుములు వసూలు చేసి తరువాత.. ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. అయినా.. ఆ రుసుము వెనక్కి ఇవ్వని వైనంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ సమయాల్లో కార్యశాల నిర్వహించడానికి చేయాల్సిన ఏర్పాట్లకు ఆ రుసుములను వెచ్చిస్తారు.

కొవిడ్‌ ముందే కార్యశాల నిర్వహణ నిర్ణయం తీసుకోవడంతో ఏఏ కేటగిరీల వారు ఎంత మొత్తం చెల్లించాలన్న అంశం ఖరారైంది. అందులో పాల్గొనాలని భావించిన వారు ఆ మేరకు చెల్లించారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఆ కార్యక్రమాన్ని చివరకు ఆన్‌లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. గత కొన్ని నెలలుగా అన్ని విశ్వవిద్యాలయాలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్లను ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఇందుకు అయ్యే వ్యయం అత్యల్పంగా ఉంటోంది. కార్యక్రమంలో పాల్గొనే అతిథులు కూడా వారుండే ప్రాంతాల నుంచే ఆన్‌లైన్లో అనుసంధానం అవుతున్నారు. పలువురు అతిథులు ఆయా కార్యక్రమాలకు హాజరైనందుకు ఎలాంటి రుసుములు వసూలు చేయడంలేదు.

మామూలు రోజుల్లో అయితే వారి ప్రయాణ ఖర్చులు, టీఏ, డీఏలు, వసతి, భోజన సదుపాయాలకు భారీగా ఖర్చయ్యేది. హాజరయ్యే వారికి ఆ కార్యక్రమ వివరాలతో కూడిన కిట్‌ను అందించేవారు. ఆయా బ్యాగులకు కూడా కొంత వ్యయం అయ్యేది. అలాగే.. సావనీర్ సైతం‌ విడుదల చేస్తుంటారు. ఆ ఖర్చులు భరించేందుకూ రుసుములు నిర్ణయించేవారు. వెబినార్‌ నిర్వహిస్తే ఆ తరహా ఖర్చులన్నీఉండవు.

ముందుగా తీసుకున్నవి ఎందుకు ఇవ్వరని ఆవేదన..

ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని వివిధ విభాగాల ఆచార్యులు అభ్యర్థుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండానే కొన్ని వెబినార్లను నిర్వహించారు. ఇందుకు విరుద్ధంగా సైన్స్‌ కళాశాల పరిధిలోని ఓ విభాగం మాత్రం వెబినార్‌ నిర్వహించి ముందు వసూలు చేసిన రుసుములను వెనక్కి ఇవ్వడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుసుముల విషయంపై సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య శ్రీనివాసరావును సంప్రదించగా కార్యక్రమ నిర్వాహకులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.

ఇదీ చదవండి:

అమరావతి భూముల కేసులో స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.