'జూన్ 11న నాకు శస్త్ర చికిత్స జరిగింది. 12వ తేదీన అనిశా అధికారులు అరెస్టు చేసి ఇబ్బందికర పరిస్థితుల్లో కారులో కూర్చొబెట్టి 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారు. అనిశా కేసుల ప్రత్యేక న్యాయాధికారి ముందు హాజరుపరచగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. జూన్ 13న గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 17వ తేదీన రెండోసారి శస్త్రచికిత్స చేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మంచం నుంచి కదిలే పరిస్థితి లేదు. ఈ నెల 1న బెయిల్ దరఖాస్తుపై అనిశా కోర్టు విచారణ జరిపింది. నిర్ణయాన్ని వాయిదా వేసింది. అదే రోజు సాయంత్రం నన్ను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. అనిశా కోర్టు అనుమతి తీసుకోకుండానే విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జైలుకు తరలించడం సరికాదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునే నిమిత్తం అనుమతివ్వండి ' అని అచ్చెన్నాయుడు పిటిషన్లో కోరారు.
ఇదీ చదవండి: విశాఖలో హైఎండ్ ఐటీ స్కిల్ వర్సిటీ: సీఎం జగన్