కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కనీస వేతనానికి కూడా నోచుకోని ఆశా కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారని కోరారు.
అనంతపురం జిల్లాలో...
పని భారంతో ఆశ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ అనంతపురంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశా వర్కర్లకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఆశ వర్కర్ల ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లలను సచివాలయలకు బదలాయింపు ఆపాలని.. వారికి సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని కోరారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
నెల్లూరు జిల్లాలో...
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఆశా వర్కర్ల యూనియన్ ఆందోళన చేపట్టింది. నగరంలోనే వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఆశ వర్కర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆశా వర్కర్ లను పర్మిట్ చేసి, కనీస వేతనం 21వేల రూపాయలు ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం కలెక్టరేట్ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చిన ఆశా వర్కర్లు..తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. కోవిడ్ వల్ల చనిపోయిన బాధిత కుటుంబాలకు బీమా పరిహారం అందచేసి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: