రానున్న ఏషియన్ ఛాంపియన్స్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తానని ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు అమెరికాలో జరిగిన సీనియర్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్లో భారత్ తరఫున ఆడి మూడు సిల్వర్ మెడల్స్ సాధించి తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జ్యోతి సురేఖకు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
అమెరికాలో జరిగిన టోర్నమెంట్లో సింగిల్, టీమ్, మిక్స్డ్ టీం మూడు ఈవెంట్లలో సిల్వర్ మెడల్ తీసుకోవడం సంతోషంగా ఉందని క్రీడాకారిణి జ్యోతి సురేఖ తెలిపారు. రానున్న ఏషియన్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: