ETV Bharat / city

RTC JAC: పీఆర్సీ జీవోలు అమలు చేసి కొత్త జీతాలు ఇవ్వాలి: ఆర్టీసీ ఉద్యోగసంఘాల ఐక్యవేదిక - ఏపీఎస్ ఆర్టీసీ తాజా వార్తలు

APSRTC JAC ON SALARIES: పీఆర్సీ జీవోలు అమలు చేసి కొత్త జీతాలు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగసంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాసిన నేతలు..కార్మికుల 11 ప్రధాన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

పీఆర్సీ జీవోలు అమలు చేసి కొత్త జీతాలు ఇవ్వాలి

author img

By

Published : Aug 2, 2022, 8:13 PM IST

ఆర్టీసీ ఎండీకి లేఖ
ఆర్టీసీ ఎండీకి లేఖ

APSRTC JAC Letter To RTC MD: ఆర్టీసీ కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీలోని అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఎండీ ద్వారకా తిరుమలరావుకు (RTC MD Dwaraka Tirumala Rao) లేఖ రాశారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని వెంటనే 11 పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ఎండీని కోరినా సరైన స్పందన లేదని లేఖలో ఐక్య వేదిక నేతలు (JAC Leaders) అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీపై జీవోలు (PRC) వచ్చి రెండు నెలలైనా.. ఇప్పటికీ అమలు కావటం లేదని, సిబ్బందికి కొత్త వేతనాలు ఇవ్వటం లేదని ఆక్షేపించారు. వెంటనే జీవోలు అమలు చేసి సిబ్బందికి కొత్త జీతాలు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఉన్న అన్ని అలవెన్సులు పునరుద్దరించాలని, ఎస్​ఆర్​బీఎస్ లేదా ఎస్​బీటీలను పునరుద్దరించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా సెటిల్​మెంట్ చేయటం అభ్యంతరకరమన్నారు. అన్ని స్థాయిల్లో పారదర్శకంగా ట్రాన్స్​ఫర్ పాలసీని (Transfer Policy) అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తిరిగి ఉద్యమం చేసే పరిస్థితి వస్తుందని ఐక్య వేదిక నేతలు హెచ్చరించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.