తెలంగాణతో అవగాహన ఒప్పందం కుదరటంతో....హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య మార్చి 22 నుంచి అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోగా... 7నెలల తర్వాత హైదరాబాద్‌కు సేవలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని మియాపూర్‌కు తొలి బస్సు బయలు దేరింది. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అప్పటికప్పుడు ఆర్టీసీ టికెట్లు జారీ చేసింది. నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయి సీట్లు నిండటంతో ప్రయాణికులతో బస్సు బయలుదేరింది.
మరోవైపు విశాఖ నుంచి హైదరాబాద్‌కు బస్సులు బయల్దేరాయి. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా ఇవాళ అవసరమైన బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయాన్నీ ప్రారంభించామన్నారు.
ఇదీ చదవండి