APPSC Schedule for AE Exam: పలు ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఉద్యోగాల నియామకం కోసం.. పరీక్ష షెడ్యూల్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మే 14, 15 తెదీల్లో ఏఈ ఉద్యోగ నియామక పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 14 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ -3 పరీక్ష నిర్వహించనుంది. మే 15 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు పేపర్ -2 పరీక్ష ఉంటుందని తెలిపింది. పరీక్ష తేదీకి వారం ముందు అభ్యర్థులు.. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీ.ఎస్ ఆర్. ఆంజనేయులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: