ETV Bharat / city

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కంటే ముందుగానే గ్రూప్‌-1 మెయిన్స్‌! - గ్రూప్‌-1 మెయిన్స్

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణపై పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పునరాలోచన చేస్తోంది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను అక్టోబరు తొలివారంలో నిర్వహిస్తామని తాజాగా యూపీఎస్సీ ప్రకటించింది. దీంతో గ్రూప్-1 పరీక్షలు అంతకంటే ముందుగానే నిర్వహించాలని ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు వస్తున్నాయి. వీటిపై పరిశీలన జరిపి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు వెల్లడించారు.

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కంటే ముందుగానే గ్రూప్‌-1 మెయిన్స్‌!

author img

By

Published : Jun 6, 2020, 7:11 AM IST

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణపై పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పునరాలోచన చేస్తోంది. తొలుత భావించిన ప్రకారం యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను ఆగస్టు, ఆ మధ్యలో నిర్వహిస్తుందని ఏపీపీఎస్సీ ఆలోచన చేసింది. దీనికి అనుగుణంగా గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను సివిల్స్‌ ప్రిలిమ్స్‌ తర్వాత నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ సూచనప్రాయంగా తెలిపింది.

అయితే.. అనుకోని రీతిలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను అక్టోబరు తొలివారం నిర్వహిస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. సమయం ఎక్కువ ఉన్నందున అంతకంటే ముందుగానే గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు వస్తున్నాయి. వీటిపై పరిశీలన జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు వెల్లడించారు.

ఇవీ చదవండి... 19 నుంచి బడ్జెట్ సమావేశాలు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.