ETV Bharat / city

Energy Discoms: విద్యుత్తు విక్రయ ఒప్పందాల రద్దుపై డిస్కంలకు షాక్.. - స్ప్రింగ్‌ సౌరకిరన్‌ విద్యుత్తు ప్రై లిమిటెడ్‌

పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న విక్రయ ఒప్పందాలను (పీఎస్‌ఏ) రద్దు చేయాలన్న డిస్కంల నిర్ణయాన్ని నిలిపేస్తూ విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఆప్‌టెల్‌) ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఖరారైన తేదీ ఆధారంగా ప్రాజెక్టు పూర్తికి గడువు నిర్ణయించాలని రాష్ట్ర డిస్కంలను ఆదేశించింది.

Energy Discoms
Energy Discoms
author img

By

Published : Aug 17, 2021, 5:08 AM IST

పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న విక్రయ ఒప్పందాలను (పీఎస్‌ఏ) రద్దు చేయాలన్న డిస్కంల నిర్ణయాన్ని నిలిపేస్తూ విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఆప్‌టెల్‌) ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఖరారైన తేదీ ఆధారంగా ప్రాజెక్టు పూర్తికి గడువు నిర్ణయించాలని రాష్ట్ర డిస్కంలను ఆదేశించింది. పీఎస్‌ఏను రద్దు చేస్తూ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)కి జూన్‌ 14న రాష్ట్ర దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాసిన లేఖపై కడపలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న స్ప్రింగ్‌ సౌరకిరన్‌ విద్యుత్తు ప్రై లిమిటెడ్‌తో పాటు మరికొన్ని సంస్థలు పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై ట్రైబ్యునల్‌ విచారణ జరిపింది.

‘2018 సెప్టెంబరు 29న అమల్లోకి వచ్చిన ఒప్పందం ప్రకారం 32 నెలల్లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని, నిర్దేశిత గడువు గత జూన్‌ 9తో ముగిసిందని పేర్కొంటూ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్‌పీడీసీఎల్‌ లేఖలో పేర్కొనడం తప్పు. 2020 ఫిబ్రవరిలో పీపీఏను ఖరారు చేసినందున అప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తికి గడువును లెక్కించాలి. గత ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించి, పరోక్ష పద్ధతిలో ఒప్పందం నుంచి తప్పుకోవటానికే ఏపీఎస్‌పీడీసీఎల్‌ లేఖ రాసినట్లుంది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా డిస్కంలపై కోర్టుధిక్కరణ చర్యలు తీసుకుంటాం’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అభ్యంతరాలను ఈ నెల 24లోగా దాఖలు చేయాలని, తదుపరి విచారణను అక్టోబరు 4న చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

అఫ్గాన్​​ పరిస్థితిపై రషీద్​ ఖాన్​ తీవ్ర ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.