ETV Bharat / city

VENKATARAMI REDDY ON PRC : 'సొంత ప్రయోజనాల కోసమే నాపై వ్యక్తిగత విమర్శలు' - PRC

VENKATARAMI REDDY ON PRC : సొంత ప్రయోజనాల కోసమే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎం జగన్‌ అన్ని సంఘాలనూ సమానంగానే చూస్తారని తెలిపారు. ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

author img

By

Published : Dec 10, 2021, 10:30 PM IST

సొంత ప్రయోజనాల కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు... తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేస్తున్నానంటూ విమర్శలు చేయటం సరికాదని సూచించారు. కొన్ని ఉద్యోగ సంఘాలు నియంత్రణ తప్పుతున్నాయని విమర్శించారు. బొప్పరాజు సొంతంగా ఏ సంఘంలోనైనా గెలిచారా అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాల విబేధాలు ఎందుకని నిశ్శబ్దంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ఎన్నుకున్న అధ్యక్షుడిని రాత్రికి రాత్రే ఎలా తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పీఆర్సీపై చర్చించేందుకు ముందుకు వస్తే కొన్ని సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయో అర్థం కావటం లేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం ముందు తనను దోషిగా, వివాదాస్పద వ్యక్తిగా నిలబెట్టాలన్నదే కొన్ని సంఘాల ప్రయత్నమని విమర్శించారు. పీఆర్సీతో పాటు అన్ని డిమాండ్లూ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పీఆర్సీ తర్వాత సీపీఎస్ కోసం ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు. కొద్ది రోజుల్లోనే పీఆర్సీ అంశం పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్టు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

సొంత ప్రయోజనాల కోసమే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు కొన్ని సంఘాల ప్రయత్నం చేస్తున్నాయి. సీఎం జగన్‌ అన్ని సంఘాలనూ సమానంగానే చూస్తారు. ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. పీఆర్‌సీపై ప్రభుత్వం ముందుకొచ్చినా ఆందోళనలు ఎందుకు?

- వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.