ఐక్యతతోనే ఆయా రంగాల్లో ముందడుగు వేయగలమని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అన్నారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం 16వ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఎంతో మేథో సంపత్తి కలిగిన చేనేత వర్గాల వారు సరైన దార్శనికత లేకపోవడంతో వెనుకబాటుకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అన్ని సంఘాల పెద్దలు పూనుకుని చేనేత కులాల మధ్య ఐక్యతను పెంపొందించాలని, తదనుగుణంగా యువతను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.
చేనేత కార్మికులెవ్వరూ ఉపాధి లేక ఆత్మహత్యలు, ఆకలిచావులకు గురి కాకూడదన్న తలంపుతో ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని నేత కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆప్కోను బలోపేతం చేసి చేనేత వర్గాల అభ్యున్నతి కోసం త్రికరణశుద్ధిగా పాటుపడతానని తెలిపారు.
ఇదీ చదవండి