తెదేపా అధినేత చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసీరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనను పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ ఆరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికే రక్షణ లేకుంటే సామన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
ఇదీచదవండి.
మే చివరికల్లా పోలవరం కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయాలి: సీఎం జగన్