విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ సెంటర్లో ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. అగ్నిప్రమాదంలో కరోనా బాధితులు మృతిచెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎప్పుడూ బిజీగా ఉండే ప్రాంతంలో కొవిడ్ కేంద్రం పెట్టడం తప్పన్నారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
'ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక కర్తవ్యం కరోనా బారినుంచి ప్రజలను కాపాడుకోవడమే. ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నా. యాంత్రికంగా కాకుండా మానవత్వంతో, శాస్త్రీయంగా పనిచేయండి. అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్పాలి. వైద్యం కోసం వస్తే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలి.' - శైలజానాథ్, ఏపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి..