ETV Bharat / city

వైకాపా... భాజపా బ్రాంచ్​ ఆఫీస్ : శైలజానాథ్ - వైసీపీపై శైలజానాథ్ కామెంట్స్

రాష్ట్రంలో ముఖ్య సమస్యలను పక్కదారి పట్టించేందుకు వైకాపా ప్రభుత్వం... అమరావతి, కోర్టు వంటి అంశాలను లేవనెత్తుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. వైకాపా.. భాజపా బ్రాంచ్ ఆఫీస్ అని , జగన్ భాజపాకు మానస పుత్రుడని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని సమస్యలపై పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. నిధులు లేని కార్పొరేషన్లు ఎన్ని ఉంటే ఉపయోగం ఏంటని శైలజానాథ్ ఎద్దేవా చేశారు.

sailajanath
sailajanath
author img

By

Published : Oct 19, 2020, 7:47 PM IST

రాజధాని అమరావతి, కోర్టు వంటి అంశాలతో, మంత్రుల భాషా ప్రావీణ్యంతో వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్క దారి పట్టిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కార్యవర్గంతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆర్​ఎస్​ఎస్​, భాజపా మానస పుత్రుడని... వైకాపా భాజపాకు బ్రాంచ్ ఆఫీస్ అని శైలజానాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా వైకాపా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఏపీలో రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ!

వైకాపా, భాజపా రైతు వ్యతిరేకులు కాబట్టే వ్యవసాయ చట్టాలు ఆమోదించాయని శైలజానాథ్ అన్నారు. పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించాలని చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఈ నెల 31న రైతులకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో కిసాన్ దివస్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1వ తేదీన విజయవాడలో వెనుకబడిన వర్గాలపై దాడులకు మహా ధర్నా నిర్వహిస్తామని... అదే నెలలో రాష్ట్రంలోని సమస్యలపై రాహుల్ గాంధీతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రాధాన్యత లేని, నిధులు లేని కార్పొరేషన్​లు ఎన్ని ఉన్నా వృధానే అని శైలజానాథ్ విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్​ను ముక్కలు చేసి ఆ నిధులు ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

తెదేపా కమిటీల ప్రకటన... బలహీన వర్గాలకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.