- నాగార్జున వర్సిటీ నుంచి సీజేఐకి గౌరవ డాక్టరేట్, ప్రదానం చేసిన గవర్నర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వర్సిటీలో జరిగిన 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గౌరవ డాక్టరేట్‌తో యూనివర్శిటీ సత్కరించింది. అనంతరం సీజేఐ విద్యార్థులకు పట్టాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
- యూట్యూబ్‌లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లు
యూట్యూబ్‌లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్, జల్సాలకు అలవాటుపడి మైనర్లు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
- అవన్నీ సీఎం జగన్ కు తెలిసే జరుగుతున్నాయన్న తెదేపా
వైకాపా నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని తెదేపా నేతలు హెచ్చరించారు. నియంతలెందరో కాలగర్భంలో కలిసిపోయిన ఘటనలు గుర్తుపెట్టుకోవాలని తెదేపా నేత యరపతినేని అన్నారు. వైకాపా నేతలు మైనింగ్ దోపిడీతో అక్రమార్జన చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్, ఫ్యాక్షన్ మాఫియాలు సాగుతున్నాయన్నారు. విశాఖలో వైకాపా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.
- కానిస్టేబుల్ హత్యకు గురై పది రోజులు, నిందితులను ఇప్పటికీ పట్టుకోని పోలీసులు
ఆయన ఓ పోలీసు కానిస్టేబుల్. రౌడీషీటర్ల చేతిలో హత్యకు గురై పది రోజులు దాటింది. కానీ ఇప్పటికీ నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేశాం. నిందితుల కోసం గాలిస్తున్నాం. అనే ప్రకటనలే తప్ప వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. ఇదంతా పోలీసుల వైఫల్యమేనని స్థానికులంటున్నారు.
- కాలేజీ బస్సు, కంటైనర్ ఢీ, ఇద్దరు మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
కాలేజీ బస్సు, కంటైనర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు ఆడుతూ పాడుతూ గడిపిన విద్యార్థులు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
- ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవం, శిశువు మృతి, ఆ నిర్లక్ష్యంతోనే
నవజాత శిశువు పుట్టిన కాసేపటికే మరణించింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమని బాలింత తండ్రి ఆరోపిస్తుండగా, ఆమెను ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకురావడమే కారణమని సిబ్బంది అంటున్నారు. మహారాష్ట్ర యావత్మాల్లో ఈ ఘటన జరిగింది.
- ఆ దేశ ప్రధానికి డ్రగ్స్ పరీక్ష, మిత్రులతో పార్టీ చేసుకున్నందుకే
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో బహిర్గతం కావడం ఆ దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలో ప్రధాని డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు గుప్పించగా తాజాగా ఆమె డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే
బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే.
- ఈ ముద్దుగుమ్మపై జాలి పడాలంటా ఎందుకో, మీకేమైనా తెలుసా
బిగ్‌బాస్ బ్యూటీ దివి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఐకాన్. ఆకర్షించే కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన గ్లామర్‌తో సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. ఈ సారి ఈ ముద్దుగుమ్మ ఓ కవితను క్యాప్షన్‌గా జోడిస్తూ.. లేటెస్ట్ ఫొటోషూట్‌ను పోస్ట్ చేసింది.
- కోహ్లీ సెంచరీకి వెయ్యి రోజులు, ఆసియాకప్‌లోనైనా అందుకుంటాడా
దాదాపు 1000 రోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒక్క శతకం కూడా బాదలేదు. చివరి సారిగా 2019లో సెంచరీ చేశాడు. అతడు ఫామ్ కోల్పోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఆగస్టు 22న జరగబోయే ఆసియా కప్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో మెరిసి ఎంతో కాలంగా వేచిచూస్తున్న 71వ శతకం పూర్తి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఆ మ్యాచ్‌లోనైనా అతడు శతకం బాదుతాడో లేదో చూడాలి.