- ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరుపై అంతర్గత పోరు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేటి నుంచి యాప్ ఆధారిత హాజరును విద్యాశాఖ అమలుచేస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని పిలుపునివ్వడంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరుకు దారితీస్తోంది.
- ఆగమేఘాలపై ధార్మిక పరిషద్ కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేసింది. మూడు రోజుల కిందట జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సోమవారం బయటికొచ్చింది. దేవాదాయశాఖ మంత్రి చైర్మన్‌గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యునిగా, కమిషనర్ కార్యదర్శిగా, తితిదే ఈవో సహా ఇతర సభ్యులు కలిపి మొత్తం 21 మంది కార్యవర్గంతో ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేసింది.
- జగనన్న గోరుముద్దకు ధరాఘాతం
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలకు మేనమామలా ఉంటానని పదేపదే చెబుతున్న సీఎం జగన్.. వారు తినే మధ్యాహ్న భోజనం ఛార్జీలను మాత్రం పెంచడం లేదు. మెనూ మార్పు చేసినట్లు గొప్పగా చెబుతున్నా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీల పెంపునకు మాత్రం చొరవ చూపడం లేదు. జగనన్న గోరుముద్దగా పథకం పేరు మార్చిన ప్రభుత్వం.. చుక్కలను తాకుతున్న ధరలకు అనుణంగా భోజనం ఛార్జీలు పెంచడంపై దృష్టి సారించడం లేదు.
- నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
నేడు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ వెళ్లనున్న సీఎం..అచ్యుతాపురం ఏపీ సెజ్‌లో ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రారంభించనున్నారు.
- భారతావని ప్రగతికి ప్రధాని మోదీ పంచ ప్రాణ ప్రతిష్ఠ
స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారతావని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి స్వయంసమృద్ధ దేశంగా అవతరించాల్సిందనేని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చిచెప్పారు. దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే కొనసాగుతున్న భారత్‌ను.. పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరింపజేద్దామంటూ పిలుపునిచ్చారు. అందుకోసం పంచ ప్రాణమంత్రాన్ని ఉపదేశించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి భూతాన్ని తరిమేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
- ఉగ్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు, 75ఏళ్లలో తొలిసారి
ఆ రెండు గ్రామాలు భారత్‌లో అంతర్భాగమే. కానీ.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా అక్కడ జాతీయ జెండా ఎగరలేదు. పంద్రాగస్టు వేడుకలకు ఏనాడూ ఆ పల్లెలు వేదిక కాలేదు. అలాంటి చోట్ల 75 ఏళ్లలో తొలిసారి మువ్వెన్నల జెండాలు రెపరెపలాడాయి. భారత్ మాతాకీ జై నినాదాలతో ఆ గ్రామాలు మార్మోగాయి.
- రష్దీపై దాడికి వారే కారణం, ఎట్టకేలకు నోరు విప్పిన ఇరాన్
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి వెనుక ఇరాన్ పాత్ర ఉందన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. రష్దీపై దాడి విషయంలో తమపై ఆరోపణలు చేసే హక్కు ఎవరకీ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. - ఎస్బీఐ రుణాలు ఇక మరింత భారం, మరోసారి వడ్డీ రేట్లు పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.
- బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు, ఆవేదనతో పోస్ట్
ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరిగిన బట్టలు, పగిలిన గ్లాస్ ముక్కలు, బికినీలతో అందాలను ప్రదర్శిస్తూ అనేక సార్లు ట్రోల్స్ బారిన పడింది. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్ మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
- ఆసియా కప్‌లో తిరుగులేని రోహిత్ శర్మ, సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడా
అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా జోరు కొనసాగుతోంది. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. త్వరలో జరగబోయే ఆసియా కప్‌కు సన్నద్ధమవుతోంది. అయితే ఈ మెగాటోర్నీలో భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మకు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఓ సారి అవేంటో చూద్దాం.
AP TOP NEWS ఏపీ ప్రధాన వార్తలు 7AM - AP TOP NEWS
.
![AP TOP NEWS ఏపీ ప్రధాన వార్తలు 7AM ఏపీ ప్రధాన వార్తలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16112811-452-16112811-1660610856368.jpg?imwidth=3840)
ఏపీ ప్రధాన వార్తలు