- "రాష్ట్రంలో ఏరులైపారుతున్న.. మద్యం కల్తీ బ్రాండ్లు"
ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం అని రాష్ట్ర మహిళలకు వాగ్దానం చేసిన జగన్.. గద్దెనెక్కిన తర్వాత దానిని విస్మరించారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో క్వార్టర్ మద్యం బాటిల్ రూ.5.20కి కొనుగోలు చేస్తే.. నేడు జగన్ రెడ్డి రూ.27కు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
- వెంకాయమ్మపై మరోసారి దాడి.. ఈ సారి ఎందుకంటే..?
గతంలో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంకాయమ్మపై.. మరోసారి అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. తనపై, తన కుమారుడిపై నల్లపు సునీత వర్గం కర్రలతో దాడిచేశారని వెంకాయమ్మ ఆరోపించారు.
- పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు.. బండ్లు రెడీ..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన వాహనశ్రేణిని సిద్ధం చేశారు. ఎనిమిది కొత్త స్కార్పియో వాహనాలను పవన్ పర్యటన కోసం కొనుగోలు చేశారు. అవి ఇవాళ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి.
- విశాఖలో గుట్టుగా డ్రగ్స్ అమ్మకాలు.. ఇద్దరు అరెస్టు
విశాఖలో డ్రగ్స్ సరఫరాదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు.. గాజువాక పరిసరాల్లో సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలను గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 63 ఎల్.ఎస్.డి. బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.
- రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం? రంగంలోకి రాజ్‌నాథ్, నడ్డా!
రాష్ట్రపతి ఎన్నికల కసరత్తును భాజపా ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల బాధ్యతలను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది.
- రూ.1.5లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలు.. ప్రత్యర్థి దేశాలకు హడల్!
గగనతలంలో ప్రత్యర్థి దేశాలు చైనా, పాకిస్థాన్‌పై పైచేయి సాధించేందుకు 114 ఆధునిక యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం లక్షన్నర కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో వీటిలో 96 యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేస్తారు. కేవలం 18 యుద్ధ విమానాలను మాత్రమే విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకోనున్నారు.
- యుద్ధం వస్తుందని చెబితే జెలెన్స్కీ వింటే కదా?: బైడెన్
భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించే ఆయుధాలను ఉక్రెయిన్‌పై ప్రయోగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాలోచన చేస్తున్నట్లు హెచ్చరికలు వస్తున్నాయి. పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టాలే ధ్యేయంగా పుతిన్ వ్యూహం రచిస్తున్నారని బ్రిటన్, ఉక్రెయిన్ అంచనా వేస్తున్నాయి. మరోవైపు యుద్ధం వస్తుందని చెప్పినా.. జెలెన్స్కీ వినలేదని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
- ఆరోగ్య బీమా ఆగిపోకుండా ఉండాలంటే?
పూర్తిస్థాయి ఆరోగ్య బీమా అవసరం ఏమిటో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనారోగ్యంలో ఆర్థికంగా భారం కాకుండా.. ఈ పాలసీ తోడుంటుంది. మారుతున్న వైద్య అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడు వస్తున్న వైద్య పాలసీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి ప్రత్యేకతల్లో.. రీస్టోరేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పవన్‌కల్యాణ్ కోసం ఆ వేషంలో వెళ్లా.. అప్పుడు చాలా బాధపడ్డా: అనుపమ
ఓ సందర్భంలో తాను చాలా బాధపడినట్లు తెలిపారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఓ స్టార్ హీరో సినిమాను బురఖా వేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లి చూసినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ విశేషాలు..
- 'భారత్‌పై ఆ ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. నేను ఉండుంటే..'
2011 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఉంటే ఫలితం మరోలా ఉండేది ఏమో అని అభిప్రాయపడ్డాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఆ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాని చెప్పుకొచ్చాడు.
AP TOP NEWS:ప్రధాన వార్తలు @7PM - ప్రధాన వార్తలు న్యూస్
.
ప్రధాన వార్తలు