- అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో అమోనియా లీక్.. మహిళలకు తీవ్ర అస్వస్థత.. ఘటనపై సీఎం ఆరా
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీలో అమోనియా వాయువు లీకైంది. దీంతో పక్కనున్న సీడ్స్ కంపెనీలో పనిచేసే రెండు వందల మందికి పైగా మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల తిరగడం, కళ్ల మంటతో ఇబ్బంది పడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ విషవాయువు ఘటన బాధాకరం.. ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం వీడలేదు: చంద్రబాబు
ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకైన ఘటనలో దాదాపు 200 మంది అస్వస్థతకు గురికావటం బాధాకరమన్నారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక.. ప్రకటించిన ఈసీ
రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్దేశపూర్వకంగానే కోనసీమ అల్లర్లు... సీఎం, మంత్రులు ఎందుకు వెళ్లలేదు?: పవన్
కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల ఘటనపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని అన్నారు. కోనసీమలో విధ్వంసం జరిగితే.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు వెళ్లలేదని, గొడవలపై నిఘా విభాగానికి సమాచారం ఎందుకు లేదని పవన్ ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటా: మోదీ
దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారసత్వ రాజకీయాలపై మరోమారు విమర్శలు గుప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్, కాన్పూర్‌లోని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పూర్వీకుల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'జమ్ముకశ్మీర్‌లో భారీగా కేంద్ర బలగాల మోహరింపు'
జమ్ముకశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు.. అమర్నాథ్ యాత్రతో పాటు కశ్మీర్లో అదనంగా కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది హోంశాఖ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- యూఎస్ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈసారీ మనదే జోరు.. హరిణికి టైటిల్
అమెరికాలో జరిగే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈసారి భారత సంతతి విద్యార్థులదే జోరు. 14 ఏళ్ల హరిణి లోగాన్ విజేతగా నిలవగా.. విక్రమ్ రాజు రెండో స్థానం దక్కించుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53 వేల మార్కు దాటింది. కిలో వెండి ధర రూ. 64 వేల 300పైకి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో సెషన్లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- హాట్‌లుక్స్‌తో కుర్రకారు మతిపోగొడుతున్న అమీ.. బికినీలో హొయలు పోతూ
సోషల్ మీడియాలో పలువురు మోడళ్లు హొయలు పోతూ వారి అందంతో కుర్రకారును కట్టిపడేస్తారు. ఆ జాబితాలో 24 ఏళ్ల అమీ ఏలా పేరు కచ్చితంగా ఉండాల్సిందే. హాట్ పోజులతో ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ టీ20 లీగ్‌లోకి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు.. బరిలోకి స్టార్ ఆటగాళ్లు!
యూఏఈలో వచ్చే ఏడాది నిర్వహించనునన్న టీ20 లీగ్‌లో మూడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు భాగస్వామ్యం కానున్నాయి. ఒక్కో ఐపీఎల్ జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు యూఏఈ లీగ్‌లో ఆడటానికి నిర్వాహకులు అనుమతినిచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ప్రధాన వార్తలు న్యూస్
.
![AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM ప్రధాన వార్తలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15462583-508-15462583-1654268779274.jpg?imwidth=3840)
ప్రధాన వార్తలు