AP students reached to Mumbai from Ukraine: ఉక్రెయిన్ నుంచి మరో ముగ్గురు తెలుగు విద్యార్ధులు ముంబైకి చేరుకున్నారు. విదేశాంగశాఖ సహకారంతో ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దుకు చేరుకున్న వారిని.. ప్రత్యేక విమానంలో ముంబై తరలించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బ్యూలా భానుమతి, సీహెచ్ లికిత్, విజయవాడకు చెందిన ఎ. అంజలిలకు ముంబై ఎయిర్పోర్టులో ఏపీ హెల్ప్ డెస్క్ అధికారులు స్వాగతం పలికారు.
అనంతరం వారి స్వస్థలాలకు చేరుకునేందుకు అవసరమైన ఫ్లైట్ టికెట్లను సమకూర్చి పంపించారు. ముంబైకి చేరుకుంటున్న విద్యార్ధులకు తెలిసేలా.. నిరంతరం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్లకార్డుతో ఎరైవల్ బ్లాక్ వద్ద ఉంచుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:
ఉక్రెయిన్లో బాంబుల మోత.. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో దడ