ETV Bharat / city

నాలుగేళ్లలో మూడు కొత్త పోర్టులు: మారిటైం బోర్డు సీఈవో

ఆంధ్రప్రదేశ్​లో 400 మిలియన్ టన్నుల ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాన్ని చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నాన్ మేజర్ పోర్టుల ద్వారా ఈ స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్ చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. త్వరితగతిన పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది.

ap-maritime-board-ceo-about-port-constructions

author img

By

Published : Jun 7, 2020, 5:30 AM IST

రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణ పనుల్ని ఈ ఏడాది ప్రారంభించి 2024లోగా పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని రాష్ట్ర మారిటైం బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి తెలిపారు. రూ.3,800 కోట్లతో రామాయపట్నం పోర్టు, రూ.3,200 కోట్లతో భావనపాడు పోర్టు నిర్మాణాన్ని ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో పూర్తి చేస్తామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని రూ.4 వేల కోట్లతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపడతామని తెలిపారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ, టెండర్‌ ప్రక్రియను ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ) పూర్తి చేస్తుందని రామకృష్ణారెడ్డి శనివారం విజయవాడలో విలేకరులతో చెప్పారు. పీపీపీ విధానంలో జీఎంఆర్‌ సంస్థ చేపట్టనున్న కాకినాడ గేట్‌వే పోర్టుకు సంబంధించిన ‘ఫైనాన్షియల్‌ క్లోజర్‌’ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ 4 పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్రం నుంచి ఏటా 350 నుంచి 400 మిలియన్‌ టన్నుల కార్గో ఎగుమతులు, దిగుమతులు చేసే వీలుంటుందని తెలిపారు.

  • ఫిషింగ్‌ హార్బర్లకు టెండర్లు
    తీర ప్రాంత జిల్లాల్లో కొత్తగా 8 అధునాతన ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని రామకృష్ణారెడ్డి చెప్పారు. వీటిని బుడగట్లపాలెం (శ్రీకాకుళం జిల్లా), పూడిమడక (విశాఖపట్నం), ఉప్పాడ (తూర్పుగోదావరి), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి), మచిలీపట్నం-2 (కృష్ణా), నిజాంపట్నం-2 (గుంటూరు), కొత్తపట్నం (ప్రకాశం), జువ్వలదిన్నె (నెల్లూరు)లో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఒక్కో ఫిషింగ్‌ హార్బర్‌కు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు ఖర్చుతో పనులు ప్రారంభించి, రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో 80 కిలోమీటర్ల పొడవునా స్టీల్‌ప్లాంట్‌ నుంచి భోగాపురం వరకు లైట్‌ మెట్రో కారిడార్లకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) త్వరలో సిద్ధమవుతుందని అన్నారు. మరో 60 కిలోమీటర్ల అధునాతన ట్రామ్‌ మెట్రో కారిడార్ల డీపీఆర్‌ తయారీకి ఇటీవల కన్సల్టెన్సీని ఖరారు చేశామని చెప్పారు.

ఇదీ చదవండి: విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.