ఈ నెల 27న తలపెట్టిన భారత్ బంద్కు(Bharat-bandh) సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రకటించింది. ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ భారత్ బంద్ పిలుపు మేరకు.. ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ అసోషియేషన్(lorry-owners-association) ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.
ఈ నెల 27న లారీలను ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఏపీ లారీ యజమానుల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. ఆ రోజున ఎక్కడా లారీలను కిరాయిలకు పంపవద్దని.. అన్ని జిల్లాల్లోని యజమానులను ఆదేశించినట్లు తెలిపారు.
పెట్రోలు, డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం నిలిపివేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవడం సహా విశాఖ ఉక్కు కర్మాగారాన్నిప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఈ నెల 27న భారత్ బంద్కు వైకాపా, తెదేపాలు కలిసి రావాలి: రామకృష్ణ