ETV Bharat / city

LETTER: 'కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేస్తే అన్నివిధాలా అనుకూలం' - ap integrated development study forum convener lakshminarayana

కృష్ణా బేసిన్ పరిధిలోని కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేస్తే అన్నివిధాలా అనుకూలమని ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక(ap integrated development study forum letter to minister Gajendra Shekawath) పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు.. గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణాలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీలో పెట్టాలని స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర జలశక్తి మంత్రితోపాటు ఉభయ నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది.

Gajendra Singh Shekawath
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
author img

By

Published : Oct 12, 2021, 3:54 PM IST

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్​పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(ap integrated development study forum letter to minister Gajendra Shekawath)​కు ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక లేఖ(ap integrated development study forum) రాసింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణాలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీలో పెట్టాలని ఏపీ పునర్విభజన చట్టం స్పష్టం చేస్తోందని.. విభజన జరిగి ఇన్నాళ్లైనా ఇది అమలుకు నోచుకోలేదని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బోర్డులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచే పని చేస్తున్నాయని తెలిపింది. అలాగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం, బేసిన్ లేకుండా.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖలో పెట్టడం సహేతుకం కాదని వెల్లడించింది. కృష్ణా బేసిన్ పరిధిలోని కర్నూలులో కృష్ణా బోర్డు(KRMB) ఏర్పాటు చేస్తే అన్నివిధాలా అనుకూలమని స్పష్టం చేసింది.

అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్న నోటిఫికేషన్​ను ఆరేళ్లు ఆలస్యంగా ఇవ్వడంపై రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తీవ్రస్థాయికి చేరాయన్నారు. తెలంగాణ.. ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తికి నీటి వాడకం, నీటి వివాదాల గురించి రెండు రాష్ట్రాలూ ప్రాజెక్టులపై పరస్పరం పోలీసులను మోహరించుకున్న పరిస్థితులకు దారీ తీశాయని స్పష్టం చేసింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ స్వాగతించదగినదేనని ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మీనారాయణ(forum convener lakshminarayana) పేర్కోన్నారు. అక్షర దోషాల వల్ల తప్పుగా నమోదైన వెలుగొండ ప్రాజెక్టును సవరించాలని అభ్యర్థిస్తే.. అది అక్రమ ప్రాజెక్టుని తెలంగాణ లేఖలు రాసింది.. దీన్ని కేంద్రం అంగీకరిస్తే కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను కూడా ఆపాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

కృష్ణా జలాల్లో 75 శాతం వాటా ఉన్నప్పటికీ వరద జలాలపై పూర్తి హక్కు ఏపీకే చెందుతుందని బచావత్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఉన్నాయని.. మిగులు జలాలను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు దిగువ రాష్ట్రంగా ఏపీకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు (letter to minister Gajendra Singh Shekawath)ను కేంద్ర జలశక్తి మంత్రితోపాటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కూడా లేఖ పంపినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి..

Sajjala: ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.