ప్రభుత్వం జారీ చేసిన మెమో 155ను సస్పెండ్‌ను చేయాలని కోరుతూ ఏపీ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పాఠశాలకు సంబంధించిన డేటాలో విద్యార్ధుల వివరాలను యాజమాన్యాలకు తెలియకుండా అధికారులు తొలగిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది . తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీచదవండి