ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్ కోసం..అన్ని శాఖల సేవలు అవసరమని అఫిడవిట్‌లో పేర్కొంది. మొదటి డోసు వేసిన నాలుగు వారాలకు రెండో డోసు వేయాలని.. కేంద్రం సూచించిందని ఈ కారణంగా అదే సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తరఫు న్యాయవాది.... కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇదీచదవండి