ETV Bharat / city

HC: అక్కడ హోర్డింగ్ విషయంలో అప్పటి వరకు జోక్యం చేసుకోవద్దు: హైకోర్టు - గద్దె రామ్మోహన్ పిటిషన్ తాజా వార్తలు

కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్న కారణంతోనే విజయవాడ ఆటోనగర్​లో తాను ఏర్పాటు చేసిన కరోనా హోర్డింగ్​ను మున్సిపల్ అధికారులు తొలగించారని గద్దె రామ్మోహన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ధర్మాసనం విచారణ జరిపింది.

అక్కడ హెర్డింగ్స్​ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించండి

author img

By

Published : Feb 28, 2022, 3:40 PM IST

Updated : Mar 1, 2022, 3:48 AM IST

విజయవాడ తూర్పు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్​రావు రుసుము చెల్లించి అనుమతి తీసుకొని హోర్డింగ్ ఏర్పాటు చేస్తే ఏకపక్షంగా ఎలా తొలగిస్తారని పురపాలక శాఖ, ఏపీఐఐసీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఆయన ఏర్పాటు చేసిన హోర్డింగ్ విషయంలో ఈ ఏడాది ఆగస్టు 31 వరకు జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎఎస్ సోమయాజులు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

కొవిడ్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలోని ఆటోనగర్, సిద్ధార్థ కళాశాల సమీపంలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అందుకు రుసుము చెల్లించి అనుమతి తీసుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు హోర్డింగ్​ను తొలగించడాన్ని సవాలుచేస్తూ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఆగస్టు 31 వరకు హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతి ఉందన్నారు. పిటిషనర్ ఫోటోతోపాటు ప్రతిపక్షనేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఫోటో ఫ్లెక్సీలో ఉండటంతో దురుద్దేశపూరితంగా హోర్డింగ్​ను తొలగించారన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అనుమతి తీసుకొని, రుసుము చెల్లించి హోర్డింగ్ ఏర్పాటు చేశాక తొలగించడం సరికాదన్నారు. పిటిషనర్ ఏర్పాటు చేసిన హోర్డింగ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

ఇదీ చదవండి : TTD Board Members Case: 'స్టే' ఉన్నప్పుడు ఆర్డినెన్స్‌ ఎలా తీసుకొచ్చారు: హైకోర్టు

Last Updated : Mar 1, 2022, 3:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.