హైకోర్టు ప్రధాన న్యామయూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర(HC Chief Justice prashanth kumar mishra) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ(vijayawada)లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Governor bishwabhushan Harichandan) జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర(Chief Justice prashanth kumar mishra)తో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం జగన్, స్పీకర్, తదితరులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వస్తున్నారు. 2009 డిసెంబర్లో ఛత్తీస్‌గడ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్ర..అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర మంగళవారం విజయవాడ చేరుకున్నారు. హైకోర్టు ప్రతినిధులు, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో జస్టిస్ మిశ్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. స్వాగతం పలికిన వారిలో జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ శేషసాయి, జస్టిస్ దేవానంద్, జస్టిస్ సురేశ్ రెడ్డితో పాటు ఇతర హైకోర్టు జడ్జిలు, గవర్నర్ కార్యదర్శి సిసోడియా, రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రస్థానం:
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురుఘసిదాస్ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాది వృతి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు , మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇదీ చదవండి
High Court CJ: 13న హైకోర్టు సీజెేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం