ETV Bharat / city

GoIR: 'జీఓఐఆర్ వెబ్​సైట్​ను పూర్తిగా మూసివేయటం చట్టవిరుద్దం' - జీఓఐఆర్ తాజా వార్తలు

GoIR: జీవోఐఆర్ అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. గత 9 నెలల్లో ఎన్ని జీవోలను వెబ్​సైట్​లో ఉంచారో.. ఎన్ని జీవోలను పక్కనపెట్టారో.., దానికి గల కారణాలతో కూడిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది.

'జీఓఐఆర్ వెబ్​సైట్​ను పూర్తిగా మూసివేయటం చట్టవిరుద్దం'

author img

By

Published : Jan 31, 2022, 4:39 PM IST

Updated : Feb 1, 2022, 4:23 AM IST

AP High Court Hearing On GoIR: జీవోఐఆర్ అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. జీఓఐఆర్ వెబ్​సైట్​ను పూర్తిగా మూసివేయటం చట్టవిరుద్దమని పిటిషనర్ తరుపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ అంటూ జీవోలను విభజించడం సెక్షన్ 4 ఆఫ్ రైట్ యాక్టుకు విరుద్దమన్నారు.

పౌరుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు...

ప్రభుత్వ జీవోలను జీఓఐఆర్ వెబ్​సైట్​లో ఉంచకపోవడంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై... సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం సమర్ధవంతమైనదో కాదో పరిశీలించకుండా యాంత్రిక పద్ధతిలో వ్యాజ్యాలు దాఖలు చేశారని పేర్కొన్నారు. జీవోఐఆర్ వెబ్​సైట్​లో జీవోలను అప్​లోడ్ చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పౌరుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ నియమావళికి అనుగుణంగా అత్యంత రహస్యం , రహస్యం , గోప్యం విభాగాల కింద పేర్కొన్న జీవోలనే ఏపీ ఈ - గెజిట్లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతేడాది ఆగస్టు 17 నుంచి ఈ నెల 28 మధ్య జారీ అయిన జీవోల్లో.. 620 ఉత్తర్వుల్ని ఈ - గెజిట్లో అప్​లోడ్ చేశామని, ప్రభుత్వ జీవో 100కు అనుగుణంగా ఉన్న 7,837 జీవోలను అందులో ఉంచలేదని పేర్కొంది.

2021 సెప్టెంబరు 7 న ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ 100 ప్రకారం.. వైద్య ఖర్చులు , వ్యక్తిగత సమాచారం, అధికారులు, వైద్య సెలవులు, వాహన ఖర్చులు, ఎక్స్ ఇండియా సెలవులు, స్టేషనరీ కొనుగోలు, ఆర్జిత సెలవులు, ఇంటి అద్దె తదితర జీవోలు ఈగెజిట్​లో అప్​లోడే చేయడం లేదన్నారు. దీంతో అప్‌లోడ్ చేసే జీవోల సంఖ్య బాగా తగ్గిందని తెలిపారు. ప్రజలకు అవసరం లేని పూర్తి వ్యక్తిగత సమాచారానికి అప్‌లోడ్ నుంచి మినహాయింపు ఇచ్చి .. సంబంధిత అధికారులకు నేరుగా తెలియజేస్తున్నాం' అని పేర్కొన్నారు. ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం కలిగించే పెద్ద విధానపరమైన నిర్ణయాలను ఈ - గెజిట్​లో ఉంచుతున్నామని ముత్యాలరాజు హైకోర్టుకు తెలియజేశారు. ఉదాహరణకు కొత్త శాఖల ఏర్పాటు, శాఖల బాధ్యతలను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయడం, చట్టాలకు సవరణ, కార్పొరేషన్ల ఏర్పాటు, ప్రభుత్వ పథకాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు తదితర అంశాలకు సంబంధించిన వాటిని అప్‌లోడ్ చేస్తున్నామని తెలిపారు. జీవోఐఆర్ వెబ్​సైట్​లో గతంలోనూ రహస్యంగా పేర్కొనే ఉత్తర్వులు బయటకు కన్పించేవి కావని... ఖాళీ పేజీతో జీవో నెంబరు ఇచ్చి గోప్యం... అని కన్పించే విధంగా జీవోలను ఉంచేవారని వివరించారు. వీటన్నింటిని పరిశీలించి.. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొట్టేయాలని అభ్యర్థించారు. శాఖల వారీగా జారీ చేసిన ఎంఎస్, ఆర్డీ జీవోలు, వాటిలో ఈ - గెజిట్​లో అప్‌లోడ్ అయినవి... చేయని వాటి వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు.

గత విధానంలో జీవో నంబర్లును కంప్యూటర్ జనరేట్ చేస్తుందన్నారు. తాజాగా నిర్ణయంతో ఆ విధానం తీసేసి ఏపీ సచివాలయ ఆఫీసు మ్యాన్యువల్, ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చేతిరాత ద్వారా మాన్యువల్ జీవో నంబరు ఇస్తారని తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు. జీవోలను వెబ్​సైట్​లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది సుమన్ స్పందిస్తూ... ఎన్ని జీవోలు అప్లోడ్ చేశాం... ఎన్ని చేయలేదో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు. అది కోర్టు ఫైల్లోకి చేరలేదన్నారు. దీంతో విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

ఇదీ చదవండి:

CM Jagan: ఉపాధి హామీ పనుల్లో గ్రామ సచివాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం జగన్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Feb 1, 2022, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.