ETV Bharat / city

బ్లాక్‌ ఫంగస్​ మరణాలపై సమాచారం లేదు: అనిల్ సింఘాల్

రాష్ట్రంలో 252 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయన్న అనిల్ సింఘాల్.. దీనికి అవసరమైన మందులను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావంతో ముందస్తుగా ఆక్సిజన్​ నిల్వలు సిద్ధం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

anil singhal on black fungus cases
బ్లాక్‌ఫంగస్​ మరణాలపై సమాచారం లేదు
author img

By

Published : May 25, 2021, 7:26 PM IST

Updated : May 25, 2021, 10:33 PM IST

రాష్ట్రంలో మెుత్తం 252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ఇంజక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామన్న ఆయన.. ఇప్పటికే 3 వేల డోసుల ఇంజక్షన్లను జిల్లాలకు పంపినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్​ మరణాలపై ఇప్పటివరకు తమవద్ద ఎటువంటి సమాచారం లేదని వెల్లడించారు. కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమిడిసివిర్​ కూడా ఎక్కడా కొరత లేదని పేర్కొన్నారు. తుపాను దృష్ట్యా ముందస్తుగా 767 టన్నుల ఆక్సిజన్‌ నిల్వలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

ఆనందయ్య మందుపై త్వరలోనే నిర్ణయం..

ఆనందయ్య మందుపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని సింఘాల్‌ అన్నారు. ఇప్పటికే మందు నమూనాలపై పలు ప్రయోగశాలల్లో పరీక్షలు జరుగుతున్నందున వాటి వివరాలు త్వరలోనే ప్రభుత్వానికి అందుతాయని తెలిపారు. నివేదిక ఆధారంగా ఆనందయ్య మందుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి:

'కరోనా కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు'

ఆనందయ్య మందు పరిశోధన.. ఆదిలోనే అవాంతరాలు

Last Updated : May 25, 2021, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.