ETV Bharat / city

ఎగువన వాడేస్తే.. మిగిలేదెక్కడ?

ఎగువ కేటాయింపుల మేరకు నీటిని వాడుకుంటే గోదావరిలో ఇక మిగులు జలాలు ఎక్కడుంటాయని ఏపీ ప్రశ్నిస్తోంది. గోదావరి-కావేరి అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న వీడియో సమావేశంలో ఈ మేరకు వాదన వినిపించనుంది. ఈ సమావేశంలో భాగస్వామ్య రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రి హాజరయ్యే అవకాశం ఉంది.

http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/29-October-2020/9348780_176_9348780_1603932666825.png

author img

By

Published : Oct 29, 2020, 6:51 AM IST

గోదావరి-కావేరి అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వీడియో సమావేశంలో ఏపీ నుంచి జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీరు నాగేశ్వరరావులు హాజరుకానున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, పాలార్‌ వరకు అనుసంధానానికి సంబంధించి ప్రస్తుతం మూడు ప్రతిపాదనలను జాతీయ జల అభివృద్ధి సంస్థ పరిశీలనకు ఉంచింది. మొత్తం 220 టీఎంసీలు మళ్లించాలనేది యోచన. ఇందులో 20 టీఎంసీలు ప్రవాహ నష్టాల వల్ల కోల్పోతే మిగిలిన 200 టీఎంసీల్లో 90 టీఎంసీల వరకు తమిళనాడుకు ఇవ్వడం, మిగిలిన నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవడమనే ప్రతిపాదన కీలకంగా ఉంది. గోదావరిపై దిగువనున్న రాష్ట్రం అంధ్రప్రదేశ్‌. ప్రస్తుతం సగటున 2500 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని లెక్కించినా ఈ నీళ్లు ఎల్లకాలం ఉండబోవనేది ఏపీ వాదన. వ్యాప్కోస్‌ అధ్యయనాల ప్రకారం.. 75 శాతం విశ్వసనీయత వద్ద తెలుగు రాష్ట్రాలకు లభిస్తున్నవి 1430 టీఎంసీలే.

రాష్ట్ర విభజన నాటికి నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఏపీకి 776 టీఎంసీలు, తెలంగాణకు 650 టీఎంసీలు సరిపోతాయని పేర్కొంటోంది. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు తమకున్న హక్కుకు మించి అదనంగా నీరు వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని ఏపీ చెబుతోంది. దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతోందని, భవిష్యత్తులో తమ ప్రాజెక్టులకు నీళ్లు లేకుండా పోతాయని వాదిస్తోంది. గోదావరిలో మిగులు జలాలుగా పేర్కొంటున్న వాటిలో 1400 టీఎంసీల నీళ్లు పక్కాగా ఎగువ రాష్ట్రాల కేటాయింపులేనని ఆంధ్రప్రదేశ్‌ ఈ సమావేశంలో చెప్పనుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు తమ కేటాయింపుల ప్రకారం ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఇక మిగులు జలాలు ఎక్కడ నుంచి వస్తాయనేది ఏపీ ప్రశ్న. గోదావరిలో 2009-10 సంవత్సరంలో కేవలం 1025 టీఎంసీలు మాత్రమే మిగులు జలాలు ఉన్నాయన్న అంశాన్ని, ఇటీవలి కాలంలో గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతున్న విషయాన్నీ సమావేశంలో ప్రస్తావించనుంది.

ఇదీ చదవండి: స్థానికంపై సమరం...కొత్త నోటిఫికేషన్​కు విపక్షాలు పట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.