రాష్ట్ర నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీ ఉదయం 11.30గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం 3.40 గంటలకు తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆయన చేరుకుంటారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. రాష్ట్ర ప్రథమ పౌరునికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈనెల 21వ తేదీలోగానే రాజ్‌భవన్‌కు చెందిన అన్ని పనులూ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. భవనం మొదటి అంతస్తును గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించబోతున్నారు. ఒక దర్బార్ హాలు, ఒక మీటింగ్ హాలు, ఏడు ఆఫీస్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. భద్రతపరంగా పోలీస్‌శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
24న బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం
రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని నీటిపారుదల శాఖ భవనాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.