కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు భారత్ స్కౌట్స్, గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. లాక్డౌన్ వేళ వలస కార్మికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సహాయపడ్డారని కొనియాడారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో భారత్ స్కౌట్స్, గైడ్స్ 70వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడటం వంటి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని భారత్ స్కౌట్స్, గైడ్స్ సభ్యులకు గవర్నర్ సూచించారు.
జెండా దినోత్సవ నిధికి తన వ్యక్తిగత సహకారాన్ని అందించిన గవర్నర్...ఈ నిధికి ఉదారంగా సహకరించాలని భారత్ స్కౌట్స్, గైడ్స్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించిన భారత్ స్కౌట్స్, గైడ్స్ కార్యకలాపాల సీడీని గవర్నర్ విడుదల చేశారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, పాఠశాల విద్య సంచాలకులు, రాష్ట్ర స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్ చిన వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి
ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ ప్రభుత్వం మనుషుల్లా చూడటం లేదు: అచ్చెన్న