ETV Bharat / city

'కొవిడ్‌ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు జేసీలకు ‍అప్పగింత' - ఏపీ కరోనా వార్తలు

కొవిడ్ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కొవిడ్ నియంత్రణ నోడల్ అధికారి కృష్ణబాబు వెల్లడించారు. అలాగే ఈ కేంద్రాల కోసం జిల్లాకు కోటి రూపాయలు చొప్పున కేటాయించామని చెప్పారు.

krishna babu
krishna babu
author img

By

Published : Jul 10, 2020, 7:19 PM IST

క్వారంటైన్‌ కేంద్రాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కొవిడ్‌ నియంత్రణ నోడల్‌ అధికారి కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాల్లో 5 వేల పడకలను పెంచాలని ఆదేశించామని తెలిపారు. అలాగే కొవిడ్‌ కేర్‌ కేంద్రాల కోసం జిల్లాకు కోటి రూపాయలు చొప్పున కేటాయించామని చెప్పారు. వైద్య పరికరాలు, సౌకర్యాలకు ఈ నిధులు వాడాలని సూచించామని వివరించారు. కొవిడ్‌ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు జేసీలకు ‍అప్పగించామని తెలిపారు.

జూన్‌ 30 వరకు కొవిడ్‌ కేంద్రాలకు చెల్లించే బకాయిలను ఈ నెల 15లోపు అందజేస్తాం. కొవిడ్‌ బాధితులకు ఆహారం కోసం రోజుకు 500 రూపాయలు కేటాయిస్తున్నాం. ఇప్పటికే పనితీరు సరిగాలేని కేంద్రాల బాధ్యులకు మెమోలు జారీ చేశాం. మంగళవారం నాటికి మార్పు లేకపోతే వాటిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు. కొవిడ్‌ కేంద్రాల్లో ఉంటున్న వారి నుంచి రోజూ అభిప్రాయాలు తీసుకుంటాం. అలాగే తిరుపతి విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరాం. ఈనెల 1 నుంచి రోజుకు 4 చార్టర్డ్‌ విమానాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ విమానాల ద్వారా 600 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తున్నాం - కృష్ణబాబు, కొవిడ్‌ నియంత్రణ నోడల్‌ అధికారి

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా కేసులు..15 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.