రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా తాజా నిర్ణయం(AP GOVERNMENT GO ON PROJECTS HANDOVER TO BOARDS ) తీసుకుంది. అయితే తెలంగాణలోని ప్రాజెక్టులను స్వాధీనం చేస్తేనే తాము బోర్డులకు అప్పగిస్తామని ఏపీ షరతు పెట్టింది. షరతులతో నేటి నుంచే ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకరించింది.
శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టులను అప్పగించేందుకు జీవో జారీ చేసింది. వీటితో పాటు ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామగ్రి, యంత్ర సామగ్రి ఎక్కడివక్కడ ప్రాతిపదికన అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. బోర్డుకు జలవిద్యుత్ ప్రాజెక్టుల స్వాధీనపరచడం, నాగార్జున సాగర్ కుడికాలువ అంశాలపై జీవోలో ప్రస్తావిచంలేదు.
జూరాల ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకోవడంపై కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ దశలో ఉన్న వివిధ ప్రాజెక్టులను.. పూర్తయ్యాక బోర్డు స్వాధీన పరచుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి:
CM REVIEW: కరెంట్ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలి: సీఎం జగన్