రాష్ట్రంలో తూర్పుగోదావరి మినహా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుందని వివరించింది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కొంది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు ఈ ఆదేశాల్ని అమలు చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: