ETV Bharat / city

Lands Value Increased: కొత్త జిల్లాల్లో భూముల విలువ.. 75 శాతం వరకు పెంచిన సర్కార్​

Lands Values in New Districts: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్‌ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది. ప్రాంతాన్ని బట్టి దాదాపు 75 శాతం మేర హెచ్చించింది. ఇది కొనుగోలుదారులకు తీవ్ర భారంగా మారనుంది. భూముల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం జమకానుంది.

increased market value of lands in the new districts
కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్‌ విలువలు భారీగా పెంచిన ప్రభుత్వం
author img

By

Published : Apr 7, 2022, 5:33 AM IST

రాష్ట్రంలోని 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెంచిన మార్కెట్‌ విలువలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన రెండ్రోజుల్లోనే మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచేసింది. ఈ పెంపునకు ప్రత్యేక రివిజన్‌ అని పేరు పెట్టింది. జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా మార్కెట్‌ విలువలను సవరించారు. దీంతో రిజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో రెవెన్యూ శాఖకు కోట్లాది రూపాయలు అదనంగా రానున్నాయి. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోనికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్‌ను బట్టి మార్కెట్‌ విలువల్లో 13 నుంచి 75 శాతం వరకు పెంచారు. బాపట్ల, నరసరావుపేట జిల్లాల్లో ఫిబ్రవరి 1 నుంచే సవరించిన మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చాయి. తిరుపతి జిల్లాలో 4 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోని 68 గ్రామాల్లో కొత్త రిజిస్ట్రేషన్‌ ధరలు అమల్లోకి వచ్చాయి. జిల్లా పరిధిలో కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 75మేర భూముల ధరలు పెంచారు.

lands value in new districts of AP: రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో కొన్ని గ్రామాల్లో 432 శాతం మేరకు భూముల విలువ పెంచేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. అప్పటి కమిటీని పర్యవేక్షిస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్‌ వీటికి ఆమోదముద్ర వేశారు. ఈ విషయంపై ఈనాడు’లో కథనం రావడంతో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. పెంపును 75 శాతానికి కుదించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌రెడ్డిని విలువలను తగ్గించి తిరిగి ఫైల్‌ తీసుకురావాలని చెప్పగా ఆయన నిరాకరించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందున ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 75 శాతం కంటే ఎక్కువగా పెంచిన భూముల మార్కెట్‌ విలువలను తిరిగి తగ్గించారు.

విజయవాడ పటమట రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని పెదపులిపాకలో మార్కెట్‌ విలువలు 37.25 శాతం పెరిగాయి. కానూరులో 13 వేల 500 ఉన్న గజం మార్కెట్‌ విలువను 17వేలకు పెంచారు. బందరు రోడ్డు ఇరువైపులా గజం 96 వేల 400 ఉండగా ..దీన్ని లక్షా 10వేలకు పెంచారు. కొవ్వూరు పట్టణం ఔరంగాబాద్‌ ప్రాంతంలో ఇప్పటివరకు ఎకరం భూమి విలువ 35లక్షలు ఉంది. ఇప్పుడు ఈ పట్టణం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లడం వల్ల...ఎకరం విలువ 42 లక్షలకు చేరింది. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరానికి సమీపంలో ఉండడం వల్లే ఇంత పెరిగింది. రాజమహేంద్రవరం కోటగుమ్మం మెయిన్‌రోడ్డులో గజం స్థలం 76వేల నుంచి 86వేలకు పెరిగింది. దేవీచౌక్‌లో గజం 42వేల నుంచి 48వేలకు పెరిగింది. కొత్తగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాలోనూ భూముల మార్కెట్‌ విలువలు పెరిగాయి. అమలాపురంలో గజం 18వేల నుంచి 22 వేల 500కు చేరాయి. పేరూరులో 8వేల 500 నుంచి 12 వేల 500కు పెరిగింది.

భీమవరం, గునుపూడి, వీరవాసరం, ఉండి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 30 ప్రాంతాల్లో కొత్తగా భూముల విలువ పెంచారు. 20 శాతమే పెంచినట్లు అధికారులు చెబుతున్నా.. 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని 76 ప్రాంతాల్లో 16 నుంచి 30 శాతం పెంచినట్లు చెబుతున్నా ...సంపతిపురం, ఊడేరులో 50 శాతం పెరుగుదల కనిపించింది. తాళ్లపాలెంలో ఎకరా 26 లక్షలు ఉంటే ఇప్పుడు 33 లక్షలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు పట్టణానికి ఆనుకొని ఉన్న 5 కిలోమీటర్లలోపు 6 గ్రామాల్లోనూ ధరలు పెరిగాయి. ప్రాంతాన్ని బట్టి సుమారు 25 నుంచి 30 శాతం పెంచారు. పార్వతీపురంతో పాటు కొమరాడ మండలం శివినిలోనూ ధరలను సవరించారు. ప్రధాన రహదారిలో గజం 18వేల నుంచి 26వేలకు....4 వేల 500 ఉన్నచోట 5వేల 8వందలకు... 6వేలు ఉన్న ప్రాంతంలో 8వేలకు పెంచారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్​ కోతలు.. వేసవి వేళ ఉక్కపోత.. దోమల మోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.