కరోనా టీకా మొదటి దశ తీసుకున్న వారికి.. రెండో దశ టీకా అందుబాటులో ఉంచటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం ఆరోపించారు. కరోనా సోకిన వారు తాము ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో తలెత్తిందని..,ఆసుపత్రుల్లో పడకలులేని పరిస్థితి నెలకొందన్నారు. కరోనాపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం జగన్ ప్రభుత్వంపై ఉందన్నారు.
అన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల పరీక్షలను రద్దు చేశారని..,కానీ ఏపీలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ..తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.
ఇదీచదవండి