ETV Bharat / city

భారత్​బంద్​: రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాసంఘాల మద్దతు

సాగు చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్​కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. ప్రభుత్వంతో పాటు మావోయిస్టులు, భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, అమరావతి రైతులు బంద్​కు మద్దతు ప్రకటించారు.

ap governament support to  bharat bandh
భారత్​బంద్
author img

By

Published : Mar 26, 2021, 5:29 AM IST

సాగు చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్​కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. మద్యాహ్నం వరకు ఆర్టీసు బస్సులు తిప్పవద్దని ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వంతో పాటు మావోయిస్టులు, భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, అమరావతి రైతులు బంద్​కు మద్దతు ప్రకటించారు.

అమరావతి జేఏసీ మద్దతు

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్​కు అమరావతి ఉద్యోగ జేఏసీ మద్దతు పలుకుతోందని ఆ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు వ్యవసాయం చేస్తేనే ప్రజలకు ఆహారం లభిస్తుందని, వారికి ఇబ్బంది కలిగేలా చట్టాలు చేయడాన్ని సమర్థించలేమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు తగవన్నారు.

జయప్రదం చేయాలి: ఐలు

నేడు జరిగే భారత్ బంద్​కు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ మద్దతు ప్రకటించింది. ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్రప్రభుత్వ సంస్థలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే భారత్ బంద్​లో న్యాయవాదులు పాల్గొని జయ ప్రదం చేయాలని ఐలు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుంకర రాజేంద్రప్రసాద్, నర్రా శ్రీనివాసరావులు కోరారు.

బంద్​ను స్వచ్ఛందంగా పాటించండి: సీపీఐ

కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక, ప్రైవేటీకరణ విదానాలను నిరసిస్తూ జరగనున్న భారత్ బంద్​లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ నేత జె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల 'భారత్​ బంద్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.